చూపులు పరచిన దారులలో
దవ్వులు తరిగిన తరుణములో
నవ్వులు చిందే మోములతో
పువ్వులు వేచెను నీ కొరకై!
చిందర వందర నడకలతో
సందడి నిండిన సంధ్యలో
నీరద బృందము వేడుకతో
నీమముగ వేచెను నీ కొరకై!
గుండెల నిండిన గుబులుతో
గూడుకట్టిన దిగులుతో
మోడుబారిన మనసుతో
గగనము వేచెను నీ కొరకై!
వత్తువు తప్పక నీవని
తెత్తువు గొప్పవి కానుకలని
మొత్తముగా అప్పగింతువని
చిత్తము వేచెను నీ కొరకై!
తెలియని తపనల తొందరలో
తెలుపగ వేచిన తలపులలో
తెరచిన రెప్పల తలుపులతో
తెరలను తీసి వేచెను నీ కొరకై!
వేచిన వేడుక రాకపోదు
నోచిన నోములు పండకపోవు
రేపోక కానుక అందరికి
తెచ్చును వేకువ ప్రతి ఒక్కరికి!
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి