కత్తి కన్నా కలం గొప్పదనుట,
అతిశయోక్తి కాదు!
కత్తి చేతనున్న ఆగ్రహమే వచ్చు!
కలము చేతనున్న కవితలొచ్చు!
కత్తి ఎల్లప్పుడూ కయ్యము కోరును!
కలము మాత్రము శాంతి కోరుచుండు!
కత్తి చిందించు రక్తము తరచుగాను!
కలము కోరును శాంతిని ఎప్పుడైనా!
ప్రవచనములు, బోధనలు కలము వంతు!
కుత్తుకలు ఉత్తరించుట కత్తి తత్వం!
కత్తితో ఫలములు కోసి తినొచ్చు!
కలముతో ఎన్నో మన్ననలు పొందవచ్చు!
కత్తితో దుష్ట సంహారం గావించవచ్చు!
కలముతో జరుగు లోక కళ్యాణంబు!
వేయేల? రెండునూ శుభకరములే!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి