సుప్రభాత కవిత :- బృంద
ప్రతి ఉదయం కొత్తదే 
ప్రతి కిరణం నేస్తమే 
ప్రతి క్షణం కానుకే 
ప్రతి వెలుగు మనకోసమే!

పువ్వులు విరిసే తోటలా
నవ్వులు  పూయించి మదిలో
దివ్వెలు  కొత్తగా వెలిగించి
దవ్వులు చెరిపే  తీరాలి!

తెరలు పొరలు తొలగించి 
అరలు కొరలు సరిచేసి 
కరువులేక ఆనందాలు
అరచేతుల్లో నింపే తీరాలి!

ఆకులెన్ని రాలిపోయినా
కొత్త చివురు వేస్తుండాలి 
దారులెన్ని మూసుకుపోయినా 
కొత్త తలుపు తెరిచే తీరాలి!

నిట్టూర్పుల నిరుత్సాహం
తరిమి కొట్టే క్రమంలో
నమ్మకపు పునాదులు 
వమ్ము కావని నిరూపించే తీరాలి!

కాలానికి సెలవులేదు 
కలలకు  గడువు లేదు 
గడచిన క్షణాలకన్నా మిన్నగా
జీవితం మార్చుకునే తీరాలి! 

🌸🌸సుప్రభాతం 🌸🌸

శుభాకాంక్షలతో 
బృంద 🙏💐


కామెంట్‌లు