నీలం సంజీవరెడ్డి:- అచ్యుతునిరాజ్యశ్రీ

 అనంతపూర్ జిల్లాకు చెందిన శ్రీనీలం సంజీవరెడ్డి ఓధనిక వ్యవసాయ కుటుంబంలో పుట్టారు 19మే 1913లో.తండ్రి చిన్నపరెడ్డి కాంగ్రెస్ వాది.సంజీవరెడ్డి అడయార్ థియొసాఫికల్ హైస్కూల్లో చదివి అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీలో చేరినాక గాంధీజీ రావటంతో, ఆయన కు బోలెడు బహుమతులులభించాయి.
వాటిని ఆయన వేలంవేస్తే శ్రీ రెడ్డి ఒకచిత్రం  షాల్, వెండిగిన్నెను దక్కించుకున్నాడు.స్టేజీపై ఉన్న గాంధీజీ చేతుల్లోంచి వాటిని తీసుకోవడానికి మొహమాటం భయంతో వెళ్లలేదు.మిత్రులంతా ముందుకు తోశారు. తాను విదేశీదుస్తులు ధరించాననే బిడియం ఆయన్ని ఆవరించింది. తప్పని సరై తలొంచుకుని బాపూజీదగ్గర అవితీసుకుని బైట పడ్డాడు.అంతే! ఆరోజునుంచి ఖాదీ ధరించసాగాడు. ఓరోజు ఓవిద్యార్ధి గాంధీ టోపీ పెట్టుకువస్తే ప్రిన్సిపాల్ ఛడామడా తిట్టి గెటౌట్ అన్నాడు.ఆమర్నాడు రెడ్డినాయకత్వంలో అంతా గాంధీ టోపీల్తో వస్తే పాపం! ప్రిన్సిపాల్ పనికుడితిలో పడ్డ ఎలుకైందని వేరే చెప్పాలా?18వ ఏటనే రెడ్డి చదువుకి గుడ్ బై కొట్టి సత్యాగ్రహోద్యమంలో చేరిఅంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి పీఠం ఎక్కారు.రాష్ట్రపతి జీతంగా కేవలం 3వేలు చాలని, గుర్రాలబగ్గీలో కాక  టాప్ లేని వాహనంలో రాష్ట్రపతి భవనం చేరారు.ఆఖరుదశలో బెంగుళూరులో గడిపి 1 జూన్ 1996లో స్వర్గస్థులైనారు🌹
కామెంట్‌లు