పల్లవి
రండి! రారండి!! సంక్రాంతి సంబరాలు...
చూతము రండి సందడిగా!
చరణం 1
పిల్లల తలపై భోగి పళ్ళు పోసి,
భోగినాడు చలిమంటలు కాగేము!
బూరెలు, గారెలు, అరిసెలతో...
బంధువులతో భోంచేస్తాము!
కొత్త అల్లుళ్లు, కూతుళ్లు వస్తే...
కోరినవన్నీ ప్రేమగ తినిపిస్తాము!
చరణం 2
తప్పిటగుళ్ళు, కోలాటాలు,
పులి వేషాలు, భజనల సందడి,
హరిదాసు పాటలు, కోడిపందాలు చూపించి ,
అల్లుళ్ల అలకలు తీర్చుతాము!
కనుమ నాడు గోమాతకు పూజ,
బసవన్నకు మైమరిపించే ముస్తాబు,
ఆడపిల్లలచే గౌరీ వ్రతాలు,
బొమ్మల కొలువులు బాగుగ చేస్తాము!
చుట్టాలను సాగనంపి, కాసేపు సేద దీరుతాము!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి