జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తారుపల్లిలో ఎస్సేస్సీ 2004-2005 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు సోమవారం సాయంత్రం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కేజీఎన్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి, క్రమశిక్షణ, సత్ప్రవర్తన పెంపొందించి సన్మార్గంలో నడిపించిన గురువులను శాలువాలు, మెమొంటోలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. బాల్యం నాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అజ్ఞానాంధకారం తొలగించి, విజ్ఞానాన్ని పంచిన గురువుల చెంత మోకరిల్లి ఆనంద భాష్పాలు రాలుస్తూ తమ ఆత్మీయతను చాటారు. సుమారు రెండు దశాబ్దాల విరామానంతరం తమ గురువులను కలుసుకునే మహదావకాశం వచ్చినందుకు మిక్కిలి సంతోషపడ్డారు. ఈ నేపథ్యంలో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తాము భోధన చేసిన విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలవడంతో ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన గురువులందరు ఆనందంతో ఉప్పొంగి పోయారు. పట్టుదలతో పని చేస్తే విజయం మీదేనని వారన్నారు. తమ శిష్యులందరూ ఏకాగ్రత, పట్టదలతో పనిచేస్తూ ఉన్నత స్థానంలో నిలవాలని, ఉన్న ఊరు, కన్నతల్లి, విద్యనందించిన గురువులకు గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమ శిష్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు.
కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
నార్ల వెంకన్న, హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్
కెంసారపు సమ్మయ్య, ఉపాధ్యాయులు సాదుల మొండయ్య, ఉషారాణి, శ్యాంసుందర్, సదాశివరెడ్డి, ఈర్ల సమ్మయ్య, కిరన్ కుమార్, రమేష్, శ్రీధర్, గౌసొద్దీన్, సతీష్,
రవీందర్ రెడ్డి పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు బిల్ల మంగ, లడే శ్రీలత,
దోబిల మాధవి,కళ్యాణి, నాంపల్లి రఘు మోహన్, కానిగంటి అంజయ్య, మహేందర్, శ్రీనివాస్, బండ మొండయ్య, కానిగంటి రమేష్, అంజయ్య, కుమార్, తిరుపతి, అశోక్, సురేష్, రాజు, వెంకటేష్ పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి