దుంపెన రమేష్ కు ఇండియన్ ఐకాన్ స్ఫూర్తి పురస్కారం

 పర్యావరణ ప్రేమికుడు, రచయిత, తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ కు ఈరోజు జనవరి 25న వరంగల్  టోనీ ప్రెస్ క్లబ్ లో తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డువారి "ఇండియన్ ఐకాన్ స్ఫూర్తి పురస్కారం" ను స్వామి వివేకానంద సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పర్యావరణ రంగంలో సామాజిక సేవలు విశేషమైన కృషి చేస్తున్నందున గాను అందజేశారనీ తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు తెలిపారు.
          ఈసందర్భంగా డా. వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ దుంపెన రమేశ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, రేడియో మెకానిక్ గా పేరు తెచ్చుకున్న అయన కళ్లకు గంతలు కట్టుకుని బండి నడిపారనీ, 19వేలకుకు పైగా ఆహ్వాన పత్రికలను పన్నెండు రాష్ట్రాలనుండి సేకరించారనీ, గోల్డ్ స్మిత్ గా , లైన్స్ క్లబ్ మెంబర్ గా, సామాజిక సేవలో కృషి చేస్తున్నారనీ ,దుంపెన రమేష్ గారు 2011 నుండి 60వేలకుపైగా మొక్కల పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరూ ఐదుకు తగ్గకుండా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని చెబుతున్నారన్నారు. అదేవిధంగా వారు రచయితగా  చిగురు ,గుమ్మడి పూలు, తులసి ,పుస్తకాలను రచించగా తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారనీ, అలాగే వారి మరణానంతరం అవయవాలను సిరిసిల్ల మెడికల్ కాలేజ్ కి ఇవ్వడానికి అంగీకార పత్రం రాసిచ్చారనీ, నిరంతరం మొక్కల సంరక్షణలోనూ సామాజిక సేవారంగంలోనూ కృషి చేస్తున్న దుంపల రమేష్ కి అనేక అవార్డులు వరించాయనీ అలాగే ఈ తెలుగు వెలుగు వారి "ఇండియన్ ఐకాన్ పురస్కారం" లభించిందనీ హర్షణీయమన్నారు 
       అవార్డు లభించడం పట్ల  డా. జి.సత్యనారాయణస్వామి, సామాజిక సేవకులు, నాయకులు మల్లుగారి నర్సాగౌడ్, తెవిరసం అధ్యక్షుడు డా. వాసరవేణి పరుశురాం, డా. జనపాల శంకరయ్య ,ఇమ్మడోజు మహేందర్, బారా ధనరాజ్ నీలకంఠం,గంప నాగేంద్రం, సాన రవి , గుండాటి వెంకట్ రెడ్డి, యమగొండ బాల్ రెడ్డి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు