****
"అవ్వా! గీ సంగతి ఇన్నవా? మొన్న గోపమ్మక్క ఇంట్లో ఓ గమ్మతి జర్గింది? గిప్పుడు సుత తల్సుకుంటె మస్తు నవ్వొత్తుంది!" అన్కుంటనే వక్కడ వక్కడ నవ్వబట్టింది.
"ఏంది శెల్లె! గంతగనం నవ్వొచ్చే ముచ్చటేంది. జర గదేందో శెప్పరాదు.అన్నట్టు యాది మర్శిన.ఆషాడం అయిపోవొచ్చింది గద! శావణపట్టి బెట్టి గాళ్ళ ఆడివిల్లను తోల్క పోడాన్కి ఎప్పుడొత్తనన్నరో గోపమ్మను అడ్గాలె అన్కుంట అన్కుంటన్న గని గీ ఇంట్లె పన్లతో అస్సలు తీర్తలేదు.
"గదే అవ్వా! గా ముచ్చెటి నీ శెవిల ఏద్దామనే వచ్చిన" అన్కుంట మల్లా నవ్వబట్టింది. గోపమ్మక్క బిడ్డ ఎల్తుంది గద రోజిన్ని అప్పలు జేసి పెడ్దమని సంగయ్య మావ గిర్ని కాడ బియ్యం బట్టిచ్చిందట. మొన్న ఊరంత సద్దు మణిగినంక ఓ తవ్వెడు పిండి గల్పి ఇంటెన్క రేకుల కింద కట్టెల పొయ్యి బెట్టి కట్టె గారెలు జేసిందంట".
గిందులో ఏం గమ్మతుంది శెల్లె! ఒక్క తీర్గ నవ్వుకుంట జెప్తున్నవ్? నాకైతే సమజైతలే! "
"ఓ అవ్వా! ఆగాగు. నేన్ జెప్పేదింక అయిపోలె. పొద్దుగాల మస్క మస్క శీకటింక వొదల్నే లేదంట. గోపమ్మక్క లేశి ఇంటి ముంగల ఊడ్శి,సానిపి జల్లి ముగ్గు కర్రేసి ఇంటెన్కకు బోయిందంట. గక్కడ రేకుల కింద ఊడ్సడాన్కి బొయ్యే సరికి ఎవలో మెసిల్నట్టయి బయపడి ఒక్కంగల ఇంట్లెకి ఉర్కి బిడ్డని,బావని లేప్కొచ్చిందంట."
వామ్మో! శెల్లె! ఎవడన్న దొంగనా ఏంది? ఇంక నయ్యం మెల్లున్న నాన్ తాడు గుంజుకోలే.గోపమ్మ అదృట్టం బాగుంది. తలో గుత్పకట్టె తెచ్చి నాల్గు ఉత్కక బోయిండ్రు.దొంగ సచ్చినోన్ని."
"గదే అవ్వా! నువ్వన్నట్టు గా దెబ్బలు గన్క ఒంటిమీద పడ్తే మల్లొచ్చె ఆషాడం దనుక లేవక పొయ్యేటోడు."
"గస్మంటి దొంగలు ఆషాడం దన్కో,అమాస దన్కో లెవ్వకపోతె లెవ్వకబోయిండ్రు. పోలీస్లకి బట్టిత్తే ఇంకో నాల్గు ఉతికి టేసన్కి తీస్కబొయ్యెటోళ్ళు. మిగతా దొంగలు ఎవలన్నుంటె బుద్ధి వొచ్చేది గద."
"ఓ అవ్వా! నువ్వన్నది సత్తెం గని.గా వొచ్చినోడు దొంగ గాదు కొత్తల్లుడు."
"ఏందీ? కొత్తల్లుడేంది శెల్లె.గాయనొచ్చి గక్కడ దాక్కునుడేంది. నాకేం సమజైతలే! గిదెక్కడి ఇచ్ఛింత్రం?"
" గందుకే అవ్వా! నవ్వాగంది. గాళ్ళ అమ్మోళ్ళు తోల్కపోవడాన్కి మూన్నాల్గు దినాలు బడ్తుంది.శీర సారె కొనేదుంది అన్నరంట. ఇంగ ఆళ్ళు ఎన్నాళ్లు ఆలీసం జేత్తరో ఏమోనని ఆగలేక రాత్రికి రాత్రే వొచ్చిండంట.నిన్నింక ఆషాడముందిగద ఏమంటరో నని గట్ల దాక్కుండంట.
"గీళ్ళు కట్టెల్తో కొట్టబోతుంటే నేను అత్తా? అన్నడంట. 'అయ్యో! శెప్పడం జర్ర ఆలీసమైన వొంటి మీద దెబ్బ పడేదేనే అని బావ గడగడలాడ్తుంటే..."
"గోపమ్మక్క ఇంతకీ "అల్లుడా! ఎప్పుడొచ్చినవ్ అంటే రాత్రొండిన గారెల్లెక్క శెప్పనా? అన్నడంట. ఇంగ జూస్కో అక్క బావ,ఆళ్ళ బిడ్డ ఒక్క తీర్గ నవ్వుడే నవ్వుడు పో. ఏందా సందడని నేనొచ్చి ఇంటెన్క గోడమీంచి సూత్తుంటే ఇషయం జెప్పిండ్రు. నాకు సుత నవ్వాగలేదవ్వా."
అవ్వ సుత ఆగకుండా నవ్వుతూ బలే గుంది శెల్లె "ఆషాఢమాసం - కొత్తల్లుని కత" "కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్టు" ఆత్రం బట్ట లేక గా రాత్రి వొచ్చినాడు. బలే ఉందిలే శెల్లె. గుత్ప కట్టె దెబ్బ ఒక్కటి తాకుంటె అయ్యకి సుక్కలాంటి పెళ్ళాం గాదు పైన సుక్కలు అగపడేటియి.ఇంతకి ఉండా? పొల్లను తోల్కొని బొయ్యిండా? శెల్లె!"
"నిన్ననే గా పిలగాని అమ్మ నాయినొచ్చి శావణ పట్టి శీరె సారె బెట్టి తోల్కోని బోయిండ్రవ్వా!"
"ఓష్నీ గిదంత నాకెందుకు ముందే శెప్పలేదేంది శెల్లె! వొచ్చి నాల్గు మంచి మాటల్తో బాటు నాలుగు మాటల సురకల్తో పరాష్కం ఆడొచ్చే దాన్ని గద! అన్కుంటనే మల్ల మల్ల నవ్వుతుంటే కొడుకు, కోడలు, పిల్లలు ఆచ్చెరంగా అవ్వొంక సూడబట్టిండ్రు.
గదండీ సంగతి. "అల్లుడా! ఎప్పుడొచ్చినవ్ అంటే రాత్రొండిన గారెల్లెక్క శెప్పనా" అన్నడంట. గట్లుంది కొత్తల్లుడి యవ్వారం,కత.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి