మన్యం కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావును ఘనంగా సన్మానించారు. పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న తిరుమలరావు, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కుదమ గ్రామస్థులు. తొలుత జిల్లా కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి మన్యం కళావేదికను ప్రారంభించారు. మన్యం కళావేదిక ప్రారంభ కార్యక్రమంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో స్వీయ గీతాన్ని ఆలపించిన తిరుమలరావును అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. మాన్యం మన్యం అనే స్వీయ గీతాన్ని తిరుమలరావు ఆలపించి పార్వతీపురం మన్యం జిల్లా గూర్చి వివరిస్తూ తన రచనలో చాటిచెప్పారు. తిరుమలరావును జిల్లా జోయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ కె.హేమలత, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ, ఇంటర్మీడియట్ డి.ఐ.ఈ.ఓ. వై.నాగేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ విజయశాంతి, నోడల్ అధికారి ఆకుల రాజు, వేదిక గౌరవ సభ్యులు గంటేడ గౌరునాయుడు, బెలగాం భీమేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, పక్కి రవీంద్రనాథ్ తదితరులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిరికి స్వామినాయుడు, చింతా అప్పలనాయుడు, పల్ల రోహిణ్ కుమార్, చుక్క పారినాయుడు, వంజరాపు శేషు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలరావుకు మన్యం కళావేదిక సన్మానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి