వన పర్వము తృతీయాశ్వాసము- * 99వ రోజు
భీముడు సౌగంధికా పుష్పములు తెచ్చుట
హనుమంతుడు చూపిన మార్గంలో ప్రయాణించి భీముడు కుబేరుని వనంలో ఉన్న సౌగంధికా పుష్పముల తోటను చేరాడు. భీముని వనరక్షకులైన రాక్షసులు అడ్డగించారు.వారు భీమునితో " అయ్యా ఇది కుబేరుని తోట కుబేరుడు ఇందులో విహరిస్తున్నాడు. ఇక్కడ ఉండటం ప్రమాదం " అని హెచ్చరించారు. భీముడు " నేను పాండు రాజు కుమారుడిని. నాపేరు భీమసేనుడు. నా భార్య ద్రౌపది ఈ సౌగంధికా పుష్పములు కావాలని కోరింది. వీట్ని తీసుకు పోవడానికి వచ్చాను " అన్నాడు. వనరక్షకులు భీమునితో " అయ్యా! నీవు ధర్మరాజు సోదరుడివి ధర్మం తెలిసి నడచుకో. నీవు కుబేరుని అడిగి ఈ పుష్పములను తీసుకు పో " అన్నారు. భీముడు " ప్రకృతి స్సిద్దమైన ఈ కొలను కుబేరునికి మాత్రమే స్వంతం కాదు అందరిది. నేను క్షత్రియుడను, ఎవ్వరినీ యాచించను, నా భుజ బలంతో తీసుకువెళతాను " అని చెప్పి కొలనులో దిగి పుష్పములు కోయసాగాడు. వనరక్షకులు భీమునితో యుద్ధానికి దిగారు. భీముడు వారినందరిని జయించాడు.వారు కుబేరునితో ఈ విషయం చెప్పారు. కుబేరుడు భీముని పరాక్రమం గురించి విని ఉన్నాడు కనుక ఉదారంగా విడిచి పెట్టాడు. భీముడు సౌగంధికా పుష్పాలతో తిరిగి వెళుతున్న సమయంలో ధర్మరాజు నకులసహదేవులు, ద్రౌపదితో కలసి భీమునికి ఎదురు వచ్చాడు. భీముడు ద్రౌపదికి సౌగంధికా పుష్పాలను ఇచ్చాడు. ఇంతలో కొంత మంది యక్షులు వారి వద్దకు వచ్చి " అయ్యా! ఈ ప్రదేశంలో యక్షులు రాక్షసులు తిరుగుతుంటారు. ఇక్కడ ఉండటం సురక్షితం కాదు " అని చెప్పారు. అందుకు అంగీకరించి ధర్మరాజాదులు అక్కడి నుండి కొంతదూరం వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నారు.
జటాసురుడు
ఒకరోజు జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో వారి దగ్గరకు వచ్చారు. అతడు పాండవులతో " నేను వేదాలను చదువుకున్నాను పరశురాముని శిష్యుడను " అని చెప్పి వారి నివాసంలో ఉంటూ వారితో పాటు తింటూ ఉంటూ ఉన్నాడు. ఒక రోజు భీముడు వేటకు వెళ్ళాడు. జటాసురుడు ఇదే అదనుగా భావించి తన నిజరూపం ధరించాడు. ధర్మరాజూ, ద్రౌపదిని, నకులసహదేవులను తీసుకుని ఆకాశమార్గంలో పరుగెత్తసాగాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులు అది చూసి భీతి చెందారు. నకులుడు రాక్షసునితో " అయ్యా! ఇప్పటి వరకు మా ఇంట భుజించి మాకు అపకారం తలపెట్టడం భావ్యమా? " అని అడిగాడు. ఆ రాక్షసుడు బదులు చెప్పలేదు. " అయితే నాతో యుద్ధం చెయ్యి " అని నకులుడు అన్నాడు. ఇంతలో విప్రుల వలన విషయం తెలుసుకున్న భీముడు వాయు వేగంతో అక్కడికి వచ్చాడు. భీముడు రాక్షసునితో " మర్యాదగా ధర్మరాజును, ద్రౌపదిని, నకులసహదేవులను విడిచి పెట్టు లేకుంటే బకాసురుడు, హిడింబుడు చచ్చినట్లు చస్తావు " అని హెచ్చరించాడు. జటాసురుడు " ఓయి భీమా! నిన్ను యుద్ధంలో చంపి బకాసురునికి, హిడింబునకు, కిమ్మీరునకు రక్త తర్పణం చేస్తాను " అని భీమునితో యుద్ధానికి దిగాడు. ఇద్దర్కి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. జటాసురుడు అలసిపోవడం గ్రహించిన భీముడు అదనుగా తీసుకుని జటాసురుని పై విజృంభించి అతనిని వధించాడు. రోమశుడు, ధౌమ్యుడు, ధర్మరాజు భీముని శౌర్యం చూసి ప్రశంసించారు.
వన పర్వము తృతీయాశ్వాసము సమాప్తం
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి