ఊహించని ఉత్సవానికి
ఊరించే స్వాగతమివ్వాలని
ఊరంతా విచ్చుకొని
ఊగుతూ ఉర్వి ఉత్సాహాలు
గెలుపు ఓటములు
నిలిపి ఉంచేయని
కాలచక్రపు వేగానికి
పాలుపోక మన పరుగులు
ముసుగేసిన కోరికలు
విసుగేసి వద్దకొచ్చి
ఉసురుపోసి నిలపమని
కొసరి చేసే వేడుకోళ్లు
అలవి కాని పనులు
అదుపు లేని ఒత్తిళ్ళు
అలసి పోయె మనసుకు
అర్థంకాని విసుగులు
వెలుతురులో తడిసి
వెతలన్నీ మరచి
వెనుతిరగక నడచి
వేడుకను వెదికే యత్నాలు
కుదురుగా మనసును ఉంచి
చెదరక చూపును నిలిపి
ఎదలో నిండిన దైవమే
ఎదురుగా వచ్చే క్షణానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి