నూతన సంవత్సర సాహితీ వేడుకల్లో కవి అయ్యలసోమయాజుల

 ప్రముఖ సహృదయ సాహితీ సంస్థ  విశాఖపట్నం వారు నూతన సంవత్సర సాహితీ వేడుకలు స్థానిక ప్రిజమ్ కళాశాలలో కవుల స్వీయ సాహితీ అనుభవాలు గురించి నిర్వహించిన సరస్వతీ సభలో ప్రముఖ కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం తన రచనలకు ప్రేరణ సమాజంలో జరిగిన సంఘటనలు, మహాకవి శ్రీ శ్రీ, దాశరథి ,కాళోజీ ,కాళీపట్నం రామారావు గారు వంటి ప్రముఖులు అని సామాజిక స్పృహ కలిగిన రచనలు సదా స్మరణీయమని కవి ,కథకుల రచనలలో ఆనాటి సామాజిక స్థితి తప్పక ఉంటుందని ప్రసంగించారు. నలభై ఆరు సంవత్సరాల నుంచి వారం వారం వివిధ సాహితీ సభలను నిర్వహిస్తున్న ఏకైక సంస్థ సహృదయ సాహితీ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాలలో అని గర్వంగా నా సాహితీ కృషికి కారణం ఈ మాతృ సంస్థ అన్నారు.    వ్యవస్థాపకులు సాహితీవేత్త శేఖరమంత్రి ప్రభాకర్, కవి, నాటక ప్రయోక్త డాక్టర్ కె. జి.వేణు ,కవులు చిన సూర్యనారాయణ, డాక్టర్ సోమంచి వినయ భూషణ్ గారు, భాగవతుల సత్యనారాయణ , శ్రీమతి రాధారాణి,వేదుల వాసుదేవ రావు మరియు సాహితీ ప్రియులు   పాల్గొన్నారు.
.................................
కామెంట్‌లు