ఎక్కువైతే అమృతం కూడా విషపూరితమే అని అంటుంటారు. ఎవరైనా అధిక కీర్తిని సంపాదించినట్లయితే, అది కూడా ప్రమాదకరం కావచ్చు అనేది నిజం.
పురాతన కాలంలో, గ్రీస్‌లో ఒక ఆచారం ఉండేది. అదేమిటంటే, ప్రజలు ఎవరినైనా బహిష్కరించాలనుకుంటే, వారు తమ పేరును ఒక కుండ ముక్కపై రాసి ఒక నిర్దుష్ట బహిరంగ ప్రదేశంలో ఉంచేవారు. అంతే, చాలా మంది దానిని ఇలాగే ఉంచే వారు. ప్రతిదీ పేరుకుపోయిన తర్వాత, ఆ ముక్కలపై ఎవరి పేరు ఎక్కువగా ఉందో వారిని పదేళ్లపాటు బహిష్కరిస్తారు. అక్కడ ఇదొక ఆచారం.
ఒక రోజు, ఒక వ్యక్తి ఆ స్థలం దగ్గరకొచ్చి నిల్చున్నాడు. అతను చేతిలో ఒక కుండ ముక్క పట్టుకుని ఉన్నాడు. అతను ఒకరి పేరు వ్రాసి ఆ స్థలంలో ఉంచాలనుకున్నాడు. కానీ అతను నిరక్షరాస్యుడు. కాబట్టి అతనికి తాననుకున్న పేరు ఎలా రాయాలో తెలియలేదు. ఎవరైనా అటుగా వెళ్తే వారిని పిలిచి రాణించాలని నిల్చుని అటూ ఇటూ చూస్తున్నాడు.
కాస్సేపటికి ఒక పెద్దాయన అటుగా రావటం చూశాడు. అంతే, నిరక్షరాస్యుడు అమ్మయ్య అనుకుని ఆ పెద్దాయన వద్దకు వెళ్లి అతని చేతిలో ఉన్న కుండ ముక్కను ఇచ్చాడు.
"అయ్యా, దీనిపై నేను చెప్పే పేరు రాయండి....నాకు రాయటం తెలీదు కనుక ఈ సాయం చేయండి" అని అతనన్నాడు. అంతట ఆ పెద్దాయన ఆ కుండ ముక్కు తీసుకుని ఎవరి పేరు రాయాలో చెప్పు అన్నాడు.
అతను, "అయ్యా, అరిస్టాటిల్ అని రాయండి" అని అన్నాడు.
అది విన్న, ఆ పెద్దాయన ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయనెవరో కాదు, ఆ పెద్దాయనే తత్వవేత్త అరిస్టాటిల్.
అరిస్టాటిల్ ఏ తానేనని చెప్పకుండా "సరేకానీ ఆ పేరు రాస్తాను...ఆయన వల్ల నీకేమైనా హాని జరిగిందా? ఆయన మీద నీకెందుకంత కోపం" అని అడిగాడు.
అంతట నిరక్షరాస్యుడు "ఆ అరిస్టాటిల్ ని నేనిప్పటి వరకూ చూడలేదు. నాయకుని వల్ల ఎలాంటి కీడూ జరగలేదు" అని అన్నాడు.
"అయితే మరి ఆ వ్యక్తిని ఇక్కడి నుంచి ఎందుకు బహిష్కరించాలని కోరుకుంటున్నావు?" అని పెద్దాయన అడిగాడు.
"అందరూ అరిస్టాటిల్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన చాలా మంచివాడే. ఆయన గొప్ప విద్యావేత్త. అందరి నోటంటా ఆయనే పేరే...ఎవర్ని అడిగినా అరిస్టాటిల్ గొప్ప విద్యావేత్త అని పదే పదే చెప్తున్నారు. దాంతో ఆ పేరు వినీ వినీ విసుగుపుడుతోంది....అందుకే కొంత కాలమైనా ఆయన్ని బహిష్కరించాలన్నది నా కోరిక...అంతేతప్ప నాకూ ఆయనకూ మధ్య ఎలాంటి సంబంధమూ లేదు" అని నిరక్షరాస్యుడు అన్నాడు.
దీని నుండి స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే, మనం మంచివాళ్ళం కావడంలో తప్పు లేదు. ఎటువంటి సమస్య లేదు. కానీ మనం మంచివాళ్ళం అని ఇతరులు చెప్పడం ప్రారంభించినప్పుడు, మనం చిరాకు పడటం ప్రారంభిస్తాము. కాబట్టి ఏదీ అతిగా జరగకుండా చూసుకోవడం మన బాధ్యత.
అరిస్టాటిల్ ఒక ప్రాచీన గ్రీకు తత్వవేత్త. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రచనలు సహజ శాస్త్రాలు. తత్వశాస్త్రం, భాషాశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, మనస్తత్వశాస్త్రం, కళలకు సంబంధించి మంచి పట్టున్న మనిషి. ఏథెన్స్‌లోని లైసియంలో పెరిపాటెటిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్థాపకుడిగా, ఆయన విస్తృతమైన అరిస్టోటేలియన్ సంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఇది ఆధునిక శాస్త్ర అభివృద్ధికి పునాది వేయడం విశేషం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి