డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్! :- అచ్యుతునిరాజ్యశ్రీ

 భారత దేశ తొలి ఉపరాష్ట్రపతి రెండో రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ పూర్వీకులు18వశతాబ్దిలో సర్వేపల్లి అనే పల్లెనుంచి వచ్చితిరుత్తణిలో స్థిరపడ్డారు.అమ్మ నాన్నలు సీతమ్మ, రామస్వామికి5గురు కొడుకులు ఒక కూతురు.రాధాకృష్ణన్ రెండవ సంతానం.తండ్రి జమీందారు దగ్గర చిన్న ఉద్యోగంచేస్తూ బీద బ్రాహ్మణుడు కావటంతో వడుగుచేసి ఇంటిదగ్గరే చదివించాడు.ఒకసారి 10ఏళ్ల రాధాకృష్ణన్ ని దొంగలు పట్టుకుని చెవులకి బంగారు పోగులు లేవని తిట్టి ప్రాణాలతో విడిచిపెట్టారు. 18ఏళ్లకే బీదపిల్ల శివ కామమ్మ తో పెళ్లి ఐంది.ఆమె11_12 ఏళ్ల పిల్ల 5వక్లాస్ చదివింది. ఈదంపతులకి 5గురు కూతుళ్లు.16 ఏళ్లురాగానే వారిపెళ్లిళ్లు చేశారాయన.ఒకే ఒక్క కుమారుడు.ఆడపిల్ల కి మగతోడు భర్త ఉంటేనే సురక్షితం అని ఆయన భావన.సనాతన నిష్ఠపూజాపునస్కారాలతో నిప్పుని కడిగే వంశంలో పుట్టిన రాధాకృష్ణన్ చదువంతా క్రిష్టియన్ మిషన్ స్కూల్స్,కాలేజీలో సాగింది.స్కాలర్ షిప్స్ తో అష్ట కష్టాలు పడుతూ ఎం.ఎ.చదివి వేదాంత గ్రంథాలు హిందీ సంస్కృతంలోవి ఆపోసన పట్టారు.21వ ఏటనే ఆయన పేరు మారుమ్రోగింది. ఆక్స్ ఫర్డ్ లో చదవాలనుకున్నా పెద్ద సంసారంతో బాధ్యతలబరువుతో వెళ్లలేదు.కులవివక్షత వల్ల5ఏళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ గాచేసిన ఆయన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీనుంచి రెండు సార్లు తొలగించి చిన్న కాలేజీలకు పంపారు.మైసూర్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చలువతో నెలకి 500జీతంపై మైసూర్ కాలేజీలో పనిచేశారు.కుటుంబంమద్రాస్ లోనే ఉంది.అదికూడా టెంపరరీయే. కలకత్తాయూనివర్శిటీ ఉపకులపతి డా.అశుతోష్ ముఖర్జీవల్ల అక్కడ చేరారు.10ఏళ్లు అక్కడ పనిచేశారు.ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెసుకు ఛైర్మన్ ఐనారు. ఆక్స్ఫర్డ్ లో 6నెలలుకలకత్తా లో 6నెలలు పనిచేస్తూ*ఇండియన్ ఫిలాసఫీ* రాశారు.ఆయనకి 43వ ఏట బ్రిటిష్ ప్రభుత్వం*నైట్ హుడ్* ప్రదానం చేసింది.1931లో ఆంధ్రాయూనివర్శిటీ, 1939లో బెనారస్ యూనివర్శిటీ కులపతిగా ఉన్నారు.కానీ మాలవీయాపై ఉన్న భక్తితో పైసా తీసుకోకుండా1948 దాకా పనిచేశారు. 1952లో యునెస్కో అధ్యక్షునిగా అందరిప్రశంసలు పొందారు🌷
కామెంట్‌లు