చుట్టాలు పక్కాలంతా
తడి ఉంటేనే ప్రేమాతిశయాలు
డబ్బు దస్కంతోనే
వేలు విడిచిన బంధుత్వాలు
తీవెలై అల్లుకుంటాయి
ఇది కరెన్సీ కాలం
కాసుకలిపే బంధాలెన్నో
పైసామేపరమాత్మ
లేవిక్కడ !?
ఉమ్మడి కుటుంబచ్ఛాయలు
స్వతంత్రతే సమ్మోహనాస్త్రము
మోనో ఫ్యామిలీ దాని ముఖచిత్రం
మన దగ్గరున్న డబ్బుంతా కరిగే దాకా
వేలు విడిచిన అత్తిపత్తి సంబంధాలు
చేతిలో చిల్లిగవ్వలేదా!?
ఒంటిపై తేళ్ళు జెర్లు
పారుతున్న వైనం
కట్టుకున్న ఇల్లాలు
ప్రేమకు చిహ్నమైన కొడుకు, కూతుళ్ళు
రక్తసంబంధీకులైన
అన్న, అక్కా, చెల్లెలు
పలు బంధాలు
ఏ బంధం ఎప్పటిదాకా
ఉంటుందో పైవాడికెరుక!?
లేదిక్కడమానవత్వం
అంతా స్వార్థప్రయోజనత్వం
అంతా గారడీతనం
మౌనమిక్కడ
అమూల్యం
హృదయ వైశాల్యశూన్యం...
అంతా పచారీ కొట్టులో దొరికే
మంచిమానవత్వం
మనుషులంతా గ్లోబల్ మార్కెట్
విక్రయవస్తువులే
కొందరు హక్కుదారులు
కొందరు బినామీలు
కొందరు బానిసలు
అందరూ ఇక్కడ అవసరాన్ని బట్టి విక్రయవస్తువులే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి