"మంత్రీ! ఏమిటి మీ ఆలోచన!?""ప్రభూ! వీరిని అంతత్వరగా నమ్మకూడదు.భారత దేశ సరిహద్దుల్లో జనాలు ఎన్నో జాతులు తెగలవారు క్రూర స్వభావంతో పాటు యుద్ధం కలహాలు కక్షలకు ప్రాధాన్యత నిస్తారు. ఎవరో ప్రేరేపిస్తే వారు ఇలా బృందంగా గూఢచారులుగా వచ్చారని నా అనుమానం.నాకు రెండురోజుల సమయం ఇవ్వండి" రెండురోజుల తర్వాత పూర్తి సమాచారంతో హరిషేణుడు రాజుని సమీపించాడు. "ప్రభూ! ఆవచ్చినవాడు సర్దారు పుష్ప దత్తుడు.శకులు వీరిపై దాడులు చేస్తున్నారు.అందుకే నానాజాతులవారంతా మీసాయం కోరాలని వచ్చారు.మనల్ని ఎదుర్కొనేశక్తి వారికి శకులకి లేవు.వీరికి మనం షరతులు పెట్టితీరాలి"" ఏంటవి?"
" మీఆధిపత్యానికి తలొంచి కుక్కినపేనుల్లా పడుండాలి. మనసైన్యం వీరి ప్రాంతాల్లో ఉండాలి.ఖర్చు వారే భరించాలి. ఓఏడాది ఆదాయాన్ని పన్నుగా చెల్లించాలి.వారి ప్రతినిధి ఒకడు మనపాటలీపుత్రంలో,మన ప్రతినిధి వారి ప్రాంతంలో ఉండాలి.""భేష్! ఇలాంటి షరతులు మనం ఇతరరాజ్యాలకి కూడా పెడదాం హరీ"యౌధేయులంతా ఆషరతులన్నిటికీ తలొగ్గి శరనార్తులన్నారు.రకరకాల విలువైన కానుకల్ని సముద్రగుప్తునికి సమర్పించారు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి