చంద్రగుప్తుడు ఆరోజు దర్పణంలో తన ప్రతిబింబాన్ని పరిశీలనగా చూడసాగాడు. అక్కడక్కడ తెల్లవెంట్రుకలు కన్పడ్డాయి.తన కురుల్ని నల్లగా నిగనిగ లాడేలా మహారాణి కుమారదేవి వాడే ఓషధులు రంగు తన శిరోజాలకి పట్టించటం అస్సలు ఇష్టముండదు రాజుకి.దీర్ఘంగా నిట్టూర్చి ఏదో ఆలోచన వచ్చి గబగబ మహారాణీ మందిరానికెళ్లాడు. "ఆర్యపుత్రులకు ప్రణామం" ఆమాటను వినిపించుకోకుండా తన తలను ఆమె ముందు వంచి"మహారాణీ! నా శిరోభారం పండిపోతున్నాయి కదూ?" అన్న భర్త మాటలకు ఫక్కున నవ్విందామె. " ప్రభూ! మీరు సదా రాజ్యపాలన, రాచవ్యవహారాల్లో మునిగితేలుతారయ్యే! ఆలోచనలు ఆందోళనతో జుట్టు మగవారికి త్వరగా తెల్లబడుతుంది.మానాన్న విక్రమదేవమహారాజు తల ముగ్గుబుట్టగా మారలేదా? స్త్రీలు అందం అలంకరణ పై శ్రద్ధ మక్కువ చూపుతూ జాగ్రత్తలు తీసుకుంటాం.పైపూతలు వాడుతాం"."అవుననుకో! కానీ..." బాధతో రాజు గొంతు పెగలటంలేదు.ఓదార్పు ఎగతాళి హాస్యం మిళాయించి అంది"మీకు ముసలివాడు ముసలివాడినవుతున్నా అనే బాధ తొలిచేస్తోంది కదూ?ఇక వానప్రస్థాశ్రమానికి తట్టబుట్ట సర్దండి" " మహారాణి గుర్తుందా నీకు రెండేళ్ల క్రితమే గురువుగారు నా చేత పూజలు చేయించి బ్రాహ్మణులందరికీ అన్నసంతర్పణ చేశారు అది ఎందుకు అంటావు వాన ప్రస్థానానికి ముందుగా నిర్వహించాల్సిన విధులే అవి" ప్రభువు మీరు 53వ ఏటా కాలిడారు అంతమాత్రానికే ముసలివారైనట్లు తెగ బాధపడుతున్నారు ఎందుకు మీ తర్వాత సింహాసనానికి వారసుని ఎన్నిక చేయండి స్వామిబాగా గుర్తు చేశావు రాణి అంటూ దీర్ఘాలోచనలో పడ్డాడు తను బాధ్యతను విస్మరించాడు నాగవంశం వారితో యుద్ధం చేస్తూ బాగా గాయపడ్డాడు అదృష్టవశాత్తు సరైన సమయానికి చికిత్స అందటంతో బతికి బయటపడ్డాడు ఇక తను సింహాసనానికి వారసుడ్ని నిర్ణయించి ప్రకటించాలి నా పెద్ద కొడుకు కాచుడు బలపరాక్రమాల్లో మొనగాడే కానీ మహా దుడుకు స్వభావం ముక్కు మీదే కోపం చిత్తం వచ్చినట్లు తలతిక్కగా ప్రవర్తిస్తాడు వాడిని అదుపులో పెట్టాలి యువరాజుగా ప్రకటిస్తాను కానీ ఒకసారి వాడి శీలం స్వభావాన్ని పరోక్షంగా పరీక్షించి తేల్చుకుంటాను అన్నాడు రాజు🌷
సముద్రగుప్తుడు 2....అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి