గురుకులంలో పిల్లల విద్యాభ్యాసం యధాప్రకారం సాగిపోతోంది.సముద్ర గుప్తుడు హరిషేణులమధ్య మైత్రీబంధం రోజు రోజుకీ పెరగసాగింది.బ్రాహ్మణుడైన హరిషేణుడు క్షత్రియ సముద్ర గుప్తునితో కల్సిపోయాడు.వీణావాదనలో ఇద్దరూ సమ ఉజ్జీలే!
కాచుడుమాత్రం కత్తి డాలు,కుస్తీతో కుయుక్తులతో హుంకరిస్తుండేవాడు.వయసుతోపాటు వాడిలో దంభం అహంకారంపెరగటాన్ని గురువు గమనిస్తూనే ఉన్నాడు.గురుపత్నితో సహా అంతా సెభాష్ అని సముద్రగుప్తుని మెచ్చుకునేవారు.తు.చ.తప్పక ఎవరేదిచెప్పినా వినయంగా చేసేవాడు.చరిత్ర, దర్శన తర్కశాస్త్రంలో హరిషేణుడు మేటి.
రాజు లో అలజడి,మనసులో కలవరం!తనకిప్పుడు 54ఏళ్లు.దర్బార్ కి వెళ్లిన తర్వాత
కాచుని యువరాజు గా ప్రకటించాలను కుంటాడు.కానీ ఏదో సందేహం సంకోచం!గురుకులంనించి ఇద్దరుకొడుకులు వచ్చేశారు. తండ్రి ఆదేశం ప్రకారం వారానికోసారి దర్బార్ కి హాజరయ్యేవారు. ఆఇద్దరిలో ఎవరు రాజు అవుతాడా అనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది.
శీతాకాలపురోజులు! చంద్ర గుప్తునితో ఇద్దరుకొడుకులు వేటకు బయలుదేరారు.కాచుడు తండ్రి రథం ఎక్కితే, సముద్రగుప్తుడు వెనకాల రథంపై బాణాల్తో అనుసరిస్తున్నాడు. అడవిజంతువులు హడావిడిగా పరుగులుతీస్తున్నాయి.దట్టమైన కీకారణ్యం! ఎక్కడనించో గాయపడిన బెబ్బులి హఠాత్తుగా పొదలమాటునుంచి రాజు పై దూకబోయింది.కనురెప్ప పాటులో సముద్ర గుప్తుడువదిలిన బాణంతో అది కుప్ప కూలింది. వెంటనే బల్లెంకూడా విసిరాడు. " ఎవరు పులిని చంపారు?" గర్జించాడు రాజు.అవకాశంగా అవకాశంకోసం ఎదురుచూస్తున్న కాచుడన్నాడు వ్యంగ్యంగా" తమ్ముడు నాన్న!"
కృత్రిమ క్రోధంతో హుంకరించాడు రాజు" సముద్రా! నన్ను నేను కాపాడుకోలేనని భావించావా?"
"క్షమించండి మహారాజా! రాజుని రక్షించుట ప్రతి ఒక్కరి ధర్మం.గాయాలతో రెచ్చిపోయిన పులి మీపై దూకబోతోంటే నాకర్తవ్యం నిర్వహించాను. అది తప్పయితే క్షమించండి" బాధ పశ్చాత్తాపంతో తలవాల్చిన కొడుకువంక చూశాడు."భళా సముద్రగుప్తా! సమయసందర్భానుసారంగా నిర్ణయం ,ప్రవర్తించటంలోనీకు నీవే సాటి! ఇకనుండి నీవే సేనాధ్యక్షుడివి""ధన్యోస్మి ప్రభూ!"
18ఏళ్ల సముద్ర గుప్తుడు సైన్యాన్ని నడపగలడా అనే సందేహం రాజుకి రాలేదు.20ఏళ్ల కాచుడు లోలోపల మహా సంతోషపడసాగాడు"నాన్న నాకే పట్టం కడతాడు.తమ్ముడిక పోటీకిరాడు"🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి