సముద్రగుప్తుడు 5...అచ్యుతుని రాజ్యశ్రీ

యువరాజు కాచుని చుట్టూ బెల్లం చుట్టూ చీమలు ఈగల్లాగా దుష్ట స్నేహితులు చేరారు" కాచా!శరణ్ శ్రేష్ఠి దుకాణంలోకి అలెగ్జాండర్ కాలంనాటి అమూల్యమైన వస్తువులొచ్చాయిట! మనకి కావల్సినవి దండుకుందాం"" నాకు మదిర కావాలి" " నాకు రకరకాల తినుబండారాలు కావాలి.నాకు ఫలాలు కావాలి" ఇలా తలా ఒకటి గొంతెమ్మ కోరికలతో  శ్రేష్ఠి దుకాణాన్ని చిందరవందర చేశారు.కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా ఉంది వారిపని. వదరుతూ మద్యం సేవిస్తూ విశృంఖల వీరవిహారం చేశారు."ఏయ్ శ్రేష్ఠీ!నాపేరు సామంతమహీపాలుడు,యువరాజుకి కుడిభుజాన్ని. కొత్త వస్తువులు ఇవ్వక పోతే చూపుతా నాతడాఖా!"పాపం చెమటలు కక్కుతూ శ్రేష్ఠి అన్నాడు" చిత్తం చిత్తం! మీకు ఏది నచ్చితే అది పట్టుకెళ్లండి!.కాచుడన్నాడు" చూశావా! యువరాజు పట్టం రాకుండానే నేను ఎలా గడగడ లాడిస్తున్నానో!?"
ఆనగర వర్తక వ్యాపారులందరికీ పెద్ద దిక్కు శ్రేష్ఠి లోలోపల కుతకుత లాడసాగాడు.కాచుడు అతని కోతిమూకకి బుద్ధి చెప్పాలి.తమకు కల్గిన అవమానం నష్టానికి ప్రతీకారం తీర్చుకోవాలి. దొంగల్లాగా భీభత్సాన్ని సృష్టించారు.అందుకే దుకాణదారులతో సమావేశమైశరణుశ్రేష్ఠి ఇలా అన్నాడు"మిత్రులారా! ఈరోజు కాచుడు తనకోతిమూకతో వచ్చి నావ్యాపారాన్ని ఛిన్నాభిన్నం చేశాడు.మనం ఆగ్రహిస్తే మనకే ముప్పు.చంద్రగుప్తమహారాజుని కల్సి మనగోడు వినిపిద్దాం"
అంతా రామదండులా రాజప్రాసాదం చేరి తమ రాకను తెలియరాలేదు.రాజు ప్రజల్లోకి వారి కష్ట నష్టాలు ఆలకించి చర్యలు తీసుకునేవాడు🌷
కామెంట్‌లు