రైతన్నల ఆశాదీపం నీవే పాడిపంటమ్మా...
పసిపాపల పాలకడలి నీవే పుడమితల్లివమ్మా...
చిన్నారులు వానజల్లులలో చిందాడే వేళ...
స్వచ్ఛమైన మట్టి వాసనను వెదజల్లుతూ...
ప్రకృతి ప్రేమను రుచిచూపే కరుణామయివమ్మా...
జీవచరాల్ని ఆలింగనం చేసుకుంటూ..
తీవ్ర ఎండ తాకిడికి కొవ్వొత్తి వోలె కరుగుతూ..
కష్టాల పూదోటలో కన్నీరు మున్నీరవుతుండగా..
ప్రాణికోటికి రక్షక కవచమై నిలుస్తున్నావమ్మా..
సేద తీరే ఆశ్రయమై నిలిచిన ఓ జననీ..!
సమస్త జగత్తును పొత్తిళ్లలో దాచుకునే
ఓ పుడమి తల్లీ…!!
అందుకోవమ్మా..
నా శిరోవందనాలు...!!!
వందనమమ్మా… వందనమమ్మా…
నీకివే నా కృతజ్ఞతాక్షరాలమ్మా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి