బంధం.. బంధనం కాకూడదు మిత్రమా !: - -యండపల్లి అనూష -తెలంగాణా సాహితి, భద్రాచలం శాఖ -7997175495
బంధం
మన అన్న భావమే బంధం..!
స్వాభిమానంతో మిడిసి పడక…
ఆప్తులపై ఆప్యాయత కురిపిస్తూ..
కష్టకాలంలో ముందుండి చేయూతనిచ్చే భరోసాయే బంధం..
అదే కావాలి ప్రతి ఒక్కరికి…!
ప్రేమానురాగాల పరిమళంతో..
దిశా దిక్సూచియై మార్గం చూపుతూ..
లాలనలో అమ్మగా…
ఆధరణలో నాన్నగా…
కష్టసుఖాల సమ్మేళనంతో ముడిపడినదే..
అపురూపమైన బాంధవ్యం…!!
కొన్ని పరిచయాలు
బంధంగానే కనుమరుగైపోతాయి…
అనురాగం, ఆప్యాయత కలగలిసిన బంధమే
అమూల్యమైన బాంధవ్యం…!!!
బంధం బాంధవ్యమై మెరవాలి…
కానీ…
ఆపేక్ష పేరిట విధించే ఆంక్షలతో..
ప్రలోభాలకు తలొగ్గి..
నిన్ను నీవు కోల్పోయే క్షణంలో..
కనువిప్పు కలిగించు!
బిగుసుకున్న బంధనానికి
బంధీ కాకుండా…
సంకెళ్లు తెంచుకుని
సాహసంగా కదలి రా!
డబ్బు వ్యామోహంలో
బాంధవ్యాలను అనగద్రొక్కే
ఈ సమాజంలో..
అనుబంధాల వైశిష్ట్యమ్ చాటి చెప్పి..
నీదైన సంతకం చేయి…!!

"బంధం బాంధవ్యంగా మారాలి..
బంధం బంధనం కాకూడదు మిత్రమా…!"



కామెంట్‌లు