సముద్రగుప్తుడు7: - అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు రాజదర్బారంతా మౌనంగా ఉంది .రాజు ఒకే ఒక్క మాటన్నాడు" ఈరోజు నేను నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. యువరాజుని నియమించే ముందు అతని ధైర్య స్థైర్యాలు,నడవడి,ఓర్పు నేర్పు సహనం మొదలైనవి పరిగణనలోకి తీసుకోవాలి.ముఖ్యంగా రాజ్య భవిష్యత్తు దానిశాంతిభద్రతలు హితం ని దృష్టిలో పెట్టుకోవాలి.పశ్చిమ దిశలో శకులు దాడికి సిద్ధంగా ఉన్నారు.రాజ్యంని దృఢంగా ఏకత్రాటిపై నడిపిస్తూ సరిహద్దుల్ని కాపాడేవాడే ఆపదవికి అర్హుడు.మహామంత్రీ! మీ అభిప్రాయం ఏంటి?" "ప్రభూ! మీవారసుడిని ప్రకటిస్తారనే అంతా ఎదురు చూస్తున్నాం. ""మహామంత్రీ! నాకిప్పుడు 54 ఏళ్లు.వానప్రస్థాశ్రమానికి సిద్ధం అవుతున్న. సముద్రగుప్తా! ఇలా రా నాయనా!"దర్బారంతా ఆశ్చర్య సంభ్రమాలతో అలా నోరు తెర్చుకు చూస్తూండిపోయింది.అశృపూరిత నయనాల్తో రాజు కొడుకును సింహాసనం దగ్గర కి తీసుకెల్తుంటే కాచుడు బుసలు కొడ్తూ నేలపై కాలిని గట్టిగా తాటిస్తూ పెద్ద  పెద్ద అంగలతో బైటకి నడిచాడు కాచుడు.అతని వెనుకే సామంతమహీపాలుడు,దుష్ట మిత్రబృందం కదిలారు. 
" సముద్రగుప్తా! నీవే ఈరాజ్యానికి సరైన పాలకుడివి. దీర్ఘాయుష్మాన్ భవ!" అంటూ తన తలపైని బంగారుకిరీటాన్ని కొడుకు తలపై ఉంచి,సభంతా జైజై ధ్వానాలు చేస్తుండగా ఆప్యాయంగా కొడుకును కౌగిలించుకున్నాడు.ఆమర్నాడు ప్రాతఃకాలం స్నానాదికాలు ముగిసిన తర్వాత  సముద్ర గుప్తుడు విశ్రాంతిగా కూచున్నాడు." ప్రభూ!" అంటూహరిషేణుడు ప్రవేశించాడు. "రావయ్యా! నీవు నా మహామంత్రివి. నీకేమిటి అడ్డంకి!?ఓ అందమైన రాగాన్ని వీణపై ఆలపించాలని ఉందయ్యా" " ప్రభూ! ఇది సమయం కాదు.రాజ్యం నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు.ఇలాంటి అశాంతవాతావరణంలో వీణ పలకలేదు ప్రభూ!"" ఇంత త్వరగా మనకు శత్రువులెక్కడనించి పుట్టుకొచ్చారయ్యా?" " ప్రభూ! రాజునెత్తిపై కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది.చుట్టు శత్రువులు బుస్సుమంటూ పడగ ఎత్తే ఉంటారని మరవకండి.మీ అన్నయ్య కాచుడే మీవెనుక కుట్ర పన్ని గొయ్యితవ్వుతున్నాడు. మనగూఢచారులు తెచ్చిన వార్త ఇది.కాచుడు స్వయంగా రోహిల్ ఖండ్ కి చెందిన అచ్యుతనందితో చేతులు కల్పాడు.రుద్రదేవ, కోతుకల్ మహారావ్ కూడా కల్సి కుట్రలు చేస్తున్నారు." హరిషేణా! నేనంటే కాచునికి ఎందుకంత ద్వేషం పగ!?"🌹
కామెంట్‌లు