అందరి కాళ్ళకు
బంధాలేసే ఓ సుందరీ..!
సిగ్గు లజ్జాలేని బ్రతుకు నీకేల..?
పరువు ప్రతిష్టలను కాలరాస్తే..?
అవి గంగలో కలిసిపోతే
ఈ సభ్యసమాజంలో నీ విలువ
గడ్డపోచ కన్నా పలచనే..
వీధిలో శునకముకన్నా హీనమే...
ఎవరు ఎంతగా చనువిచ్చినా
నీ హద్దుల్లోనే నీవు వుండు
ముందుకు దూకితే ముప్పే...
మూడోవ్యక్తితో చనువు తప్పే...
అది నిన్ను నిలువునా
దహించే నివురుగప్పిన నిప్పే..!
కారణం కడలిలో కెరటాలు
ఎంతగా ఎగిసిపడినా
తీరాన్ని తాకితే వినోదమే...
తీరం దాటితే తుఫానే
విధ్వంసమే వినాశనమే..
ఔను జీవితం కూడా అంతే...
అందుకే అందాలు ఆరబోసే
కామంధులకు విందుచేసే
ఓ బంగారు బాపు బొమ్మా
ఈ ఒక్క పచ్చినిజం తెలుసుకోవమ్మా
కాదని ఒక్క అడుగు ముందుకేసినా...
నీవు గాలిలేని బంతివే...
దారం తెగిన గాలిపటానివే...
నీ బ్రతుకు కుక్కలు చించిన విస్తరే...
ఆ అతి చనువే రేపు కావొచ్చు
నీ బ్రతుకును కాల్చే కారుచిచ్చు
జాగ్రత్త...జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి