అసాధారణం!!; - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
ఒంటరిగా 
ఉండడానికి నక్షత్రాలు పుట్టలేదు. 

ఒంటరిగా 
ఉండటానికి గ్రహాలు పుట్టలేదు.!!

ఒంటరిగా 
ఉండడానికి ఉపగ్రహాలు పుట్టలేదు! 

ఒంటరిగా 
ఉండడానికి వృక్షాలు పుట్టలేదు 

ఒంటరిగా 
ఉండడానికి జంతువులు పుట్టలేదు!!?

అన్ని సమూహంగానే ఉన్నాయి. 

ఈ భూమిపై 
ఈ ఆకాశంపై 
ఏది ఒంటరిగా ఉండడానికి 
పుట్టలేదు!!?

ఒక్క మనిషి తప్ప!!?
అది అసాధారణం.!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు