వద్దురా వద్దురా యుద్ధము..: - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ -9640748497
పల్లవి:
వద్దురా వద్దురా 
యుద్ధము‌..
యుద్ధం వలన జగము నిర్వీర్యమైపోవు

చరణం1
నాగరికత నశించును 
నగరాలు వల్లకాడవును
చారిత్రక కట్టడాలు శిథిలాలు గా మిగులును

చరణం 2 
ప్రపంచ యుద్ధాలు రెండు జరిగాయిరా
కత్తులు వర్షించాయి రక్తధారలు
పీనుగుల గుట్టలాయెరహదారులు

చరణం 3 
శాంతి సౌఖ్యం సమరసభావం 
సందేశమై భువిన పరిఢవిల్లితే
జగమంత కుటుంబమై వర్థిల్లదా
 మంచిమమతే మనధర్మమై
నిలిచేనుగా


కామెంట్‌లు