ఫాస్ట్ కల్చర్ ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్ : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
పుట్టు గ్రుడ్డివాడైనా
ఆ కళ్ళు లేని కబోది
చెవులతో లోకుల భావాల్ని 
అవగతం చేసుకుంటాడు
తన ప్రియమైన సంభాషణ
 నైపుణ్యంతో పదుగురి మనస్సులను గెలుచుకున్నాడు
వైకల్యం అవయవానికేగానీ
ఆలోచనలకు ఉండదు కదా!?

తల్లి గర్భంలోనే సకలం తల్లి ఉచ్చ్వాస 
నిచ్ఛ్వాసలతోనే నేర్చుకున్నాడు బాలాభిమన్యుడునాడు
నేటి తల్లులకు అంతటి ఓపిక, ఓరిమి కలదా!? 
వేగవంతమైన జీవనవిధానంతో 
గర్భస్థ శిశువు ఏమీ నేర్పలేని నిస్సహాయతతో
ఇప్పుడుఉన్నారా!?
నాటి మహాతల్లి లాంటి సుభద్రలు
అంతా ఫాస్ట్ కల్చర్
ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్


కామెంట్‌లు