పల్లవి :
అయ్యో !నాకొడుకు
అమ్మో!నాకొడుకు
నా కొడుకు సక్కంగ సదువుతున్నాడే సదువుతున్నాడే
అవ్వ అయ్యను మరిసి మమ్మిడాడంటే
మమ్మిడాడంటే2
చరణం 1
గివిట్టుమన్నాడు
టేకిట్టుమన్నాడు
గివిట్టుయంటేను గీకుమన్నట్టో
గోకుమన్నట్టో
టేకిట్టుయంటేను టాకుమన్నట్టో టేకాఫ్ మన్నట్టో
/అయ్యోనాకొడుకు/
చరణం 2
మమ్మిమమ్మీనాకు పప్పీయమండూ
పప్పీయమడూ2
పప్పీయమంటేను
పప్పేయమండో పెరుగేయమండో2
/అయ్యో నాకొడుకు/
వచ్చి రాని సదువు
ఒళ్ళంతపలుగు
ఒళ్ళంత పలుగు
అమ్మభాషయేర అవనికివెలుగు
మాతృభాషేమనకు తల్లిచనుబాలతీరు
పరాయిభాషేర పోతపాలురా
ఉపాధి ఉద్యోగాలకు పరభాషయైనా
సంభాషిస్తేశోభించుమాతృభాషరా2

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి