చిన్నితెరవేదికగాజీడి పాకపు సీరియళ్లుమనది కాని విషసంస్కృతిని పెంచి పోషిస్తుంటేకుట్ర కుతంత్రాలతో మానవ సంబంధాలను విచ్ఛిన్నంపచ్చని కాపురాల్లోఅసూయా ద్వేషాలు ఘర్షణలు,ఏ విలువలకిది పరాకాష్టకత్తిపోటుకన్నా...బలిగొనే విషంకన్నాబలమైన మారణాయుధాలు కావా ఇవిఎవరు కట్టడి చేయాలి సామాజిక మాధ్యమాలనుతప్పు ఒప్పు అనుకునే కృత్రిమ సంఘం ఎప్పటికి కూలిపోతుందికంటెంట్ లెస్ సినిమాలు , సీరియల్స్,షోస్ బూతునంతానీతులంటూ వండివార్చుతుంటేఅర్థనగ్నత్వమే అంగీకారమైనదన్నట్టురచ్చలో చర్చనషాళానికి అంటుతుంటేమన ఆహార్యం ఆదిమానవుడిదైపోతేఎవరు బాగుపరచాలి సభ్యసమాజాన్నిఎప్పటికీ బాగుపడేరు రేపటి తరంప్రపంచ వ్యాప్తంగా వస్తువినిమయసంస్కృతిపెరిగిఆర్థిక సామాజిక అసమానతలు పెంచి పోషించబడుతుంటేఉక్కుపాదం మోపవలసిన ఏలికలే మిన్నకుంటేమనుషులు జ్ఞానలేమితో యంత్రమయ్యారా!కనులు తెరిచి చూస్తునే నేనేమీ చూడట్లేదు అనే నిస్సహాయత చూపుతున్నారుఇలా అయితే ఎప్పటికీ బాగుపడుతుందీ సమాజంఎదిరించలేక, భయం వీడి బ్రతకలేకబిక్కు బిక్కు మంటూ ఎంతకాలమీ చస్తూ బ్రతకడంప్రశ్నిస్తేనే కదా ప్రగతి లేకుంటే అధోగతే కదా!రైతును బికారిని చేస్తున్నరాజ్యంఆలమందలమ్ముకొని యాంత్రిక వ్యవసాయంతోపెట్టుబడిదారీ కనుసన్నల్లోవ్యవసాయం కుదేలవుతున్న కృషీవలుడుసాయం లేని వ్యవసాయంతీర్చలేక అప్పుల కుప్పలుఉరికొయ్యకు వ్రేలాడుతున్న అన్నదాతలుఎవరీ సమస్యల్ని పరిష్కరించేది?చూస్తూ మౌనం దాల్చిన జనబాహుళ్యంఇది ఇప్పుడు తనదికాదీబాధ అని అనుకునే ప్రతీ ఒక్కరికిది రేపుతలభారమైపోతుందిగాఇప్పుడు మనం తప్పునుతప్పనకుంటే జరిగే పరిణామం ఊహకందనిదికాలగమనాన్ని బట్టి మనుషుల ప్రవర్తనలు మారడం ఎంతటి అమానవీయంమంచి మానవత్వందయా జాలి కరుణపరస్పర సహకారంఇవి మార్కెటైజ్ కాకూడదు కదా!ప్రతీ వాడు డబ్బుకే పెద్ద పీట వేస్తే మన బ్రతుకులన్నీ చిధ్రమేకదా!ప్రపంచం ఓ కుగ్రామమైన ఈవేళమనం తప్పును ఎంతైనా బలంగా సామాజిక మాధ్యమాల్లో వినిపించొచ్చువాస్తవాలను ప్రసారం చేయోచ్చుప్రపంచ వ్యాప్తంగా 80శాతంపైబడిఉన్న బడుగు బలహీనులఈతిబాధలు,శ్రమదోపిడిఉపాధి హామీలుజీవన ప్రమాణస్థాయిలువిద్య ఉద్యోగకల్పనస్వేచ్ఛాజీవనంవీటిపై అవగాహన పెరగాలిచర్చజరగాలిఎటువంటి అరమరికలు లేనివసుధైక కుటుంబ భావన పరిఢవిల్లాలిజగమే స్వర్గసీమవ్వాలి****
ఏది? ఎక్కడ సామాజిక బాధ్యత : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి