ఊతచేష్టలు-ఉద్ధెరచదువులు: - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
ఎందుకీ చదువులు
జ్ఞాన లేమి చదువులు
చూచి వ్రాతల పరీక్షలు
వందకు వంద మార్కులు 

ప్రత్యక్షానుభవ పరీక్షల్లేవు
నిరంతర మూల్యాంకనం లేదు
చదువుకునేవాడికి శ్రద్ధేలేదు  
సమయసారిణిలేనేలేదు
సమయపాలన అసలేలేదు

స్మార్ట్ ఫోనే విజ్ఞానసర్వస్వం 
బొక్కల ప్యాంటు ధరిస్తారు 
వెకిలి చేష్టలు, వదరుబోతులు
భూమికి భారమైనోళ్ళు
ముందు కాలపు ముదనష్టపుతరం
తలుచుకుంటేనే వణుకు బుట్టు

తప్పుచేసిన దండన శూన్యం 
టీచర్లిక్కడ నిమిత్తమాత్రులే
మనసు చంపుకొని ఉద్యోగాలు 
మార్పురాని పిల్లల జీవితాలు

చెబితే వినని చెడ్డ కోతులు 
వాడి పాకెట్టు మనీకి కోతబెడితే
తిండి బెట్టి అమ్మానాన్న 
తిట్ల దండకం ఎత్తుకుంటే
ఎదురుతిరిగితే
ఏకాకిని చేస్తే 
దెబ్బకు దయ్యం వదిలిపోదా!
సోయికొస్తే బ్రతుకు మారదా! 


కామెంట్‌లు