మనిషంటే డబ్బులు సంపాదించే యంత్రం
మంచితనం అంటే మాటకరితనం..
మోసం చేయడమే గొప్పతనం సహనం,
మానవత్వంతో జీవించడం చేతకానితనం
అంతులేని స్వార్థం ఉంటే అవే తెలివితేటలు.
.ఐన వాళ్లంటే అవసరానికి వాడుకునే వస్తువులు.. బంధాలు,
బాంధవ్యాలు ఏ విలువ లేని వ్యర్ధపదార్థాలు..
ఒక్క తల్లి బిడ్డలకే అస్సలు పడక కొట్టుకుచచ్చే వైనం..
ఆస్థి, అంతస్తులే జీవిత పరమార్ధం..
పగలు ప్రతీకారాలే పరమానందం
కక్షలు,కార్పణ్యాలే కుటుంబ అభివృద్ధికి సోపానం..
కన్నవాళ్ళు పిల్లలకి బరువు
పెద్దవాళ్ళకి పిల్లలు పరువు
ఆప్యాయతానురాగాలు కరువు
ఉమ్మడి కుటుంబాల ఊసే లేదు..
అన్నీ చిన్న కుటుంబాలే
నేడు..ఇళ్లల్లో ప్రేమలు పంచి,
పెంచే పెద్దతరం లేరు, వారి అనుభవాలూ లేవు..
అంతా రాకెట్ కాలం..రోబోల మయం..
ఇంకెక్కడ కనిపిస్తాయి బంధాలు.. అనుబంధాలు..?
ఒకప్పుడు ఉండేవని చెప్పుకోవడానికి తప్ప..
ఈరోజుల్లో బంధాలు
అనుబంధాలు దొరకాలంటే
ఎండమావిలో నీరు కోసం వెతికినట్లే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి