చేత వెన్న ముద్ద: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
వెన్నెల్లో చల్లదనము
వెన్నముద్ద మెత్తదనము
అసమానం జగతిలో
కన్నవారి త్యాగగుణము

తెలుగుభాష తీయదనము
పద పదము చక్కదనము
గలమెత్తి పాడాలోయ్!
మాతృభాష గొప్పదనము

వెన్నముద్ద రీతిలో
మిన్న కదా పసి పిల్లలు
సన్నజాజి అందాలు
పవిత్రమే హృదయాలు

వెన్నముద్ద చేతిలో
పెట్టుకుంటే నోటిలో
కరిగిపోవు మృదువుగా
ఎంచక్కా నిముషంలో

బలే బలే వెన్నముద్ద
ఇష్టమైన వెన్నముద్ద
చిన్నారుల మాదిరిగా
ఉండు చేత వెన్న ముద్ద

వెన్నను గనుక కరిగిస్తే
చక్కని నెయ్యి వస్తుంది
దాన్ని కల్పి భుజిస్తే
శక్తి ఎంతో ఇస్తుంది


కామెంట్‌లు