నిజమే కదూ!: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
నింగిలోని వేగు చుక్క
చీకట్లు తరుముతుంది
పుడమిపై చిన్ని మొక్క
పచ్చదనం పంచుతుంది

ఇంటిలో పెంపుడు కుక్క
రక్షణ కల్పిస్తుంది
కాసింత గంధపు చెక్క
తావులు వెదజల్లుతుంది

అమూల్యమైనది చెలిమి
జీవితాల్లో  బహు బలిమి
కల్గియుంటే క్షేమము
అదే తరిగిపోని కలిమి

దాహాన్ని తీర్చుతుంది
కాపాడితే చెరువు
ఆయుస్సును పెంచుతుంది
సంరక్షిస్తే తరువు


కామెంట్‌లు