ఉంటేనే మేలు: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
చేతిలోని డబ్బులు 
నోటిలోని మాటలు 
వాడితే పొదుపుగా 
బాగుండును బ్రతుకులు 

మనసులోని మమతలు 
పవిత్రమైన తలపులు 
ఉంటేనే ఘనతలు 
బ్రతుకులోన విలువలు

ఇంటిలోన పిల్లలు 
తోటలోన మల్లెలు 
ఉంటేనే సొగసులు 
మొగంలోన నగవులు 

కొలనులోన కలువలు 
నింగిలోన చుక్కలు 
ఉపయోగం చాలా 
పుడమిలోన మొక్కలు 


కామెంట్‌లు