మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా శ్రీకాళహస్తిలో చదివాను. ప్రతి శివరాత్రికి పాలు కూడా త్రాగకుండా మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి గుడిలో ఆ శివయ్య దర్శనం చేసుకుని మళ్లీ మూడు మైళ్ళు నడిచి ఇంటికి వచ్చి అప్పుడు ఫలహారం తీసుకునే దాన్ని. అలా పెరిగిన నాకు డిగ్రీ ఏలూరు st. థెరిసాస్ కాలేజీలో చదువుతున్నప్పుడు శివరాత్రి రోజున గుడికా? సినిమా కా? అని వార్డెన్ అంటే అందరూ "చిత్ చోర్" సినిమాకి ఓటు వేశారు . సో రాత్రి దాకా ఉపవాసం ఉండి ఈ రోజు శివుని చూసే భాగ్యం నాకు లేదని మనసులో తలుచుకుంటూ రాత్రి నిద్రపోయే ముందు చర్చికి వెళ్లే అలవాటు ఉన్న నేను అక్కడికి వెళ్ళగా యేసుక్రీస్తు స్థానంలో నాకు కనిపించింది ఎవరో తెలుసా?
వాయులింగ స్వరూపుడైన శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ జన్మకి ఇది చాలదా అనిపించిందా క్షణంలో!
ఈ సంఘటన "కరుణించిన కాళహస్తీశ్వరుడు"
గా "శ్రీశైల ప్రభ" లో ప్రచురితమైంది.
మీ
యలమర్తి అనురాధ.
*
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు!: - యలమర్తి అనూరాధ- హైదరాబాద్ -చరవాణి:924726౦206
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి