తెలుగు భాష-గుండెల్లో శ్వాస : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
 తెలుగు భాష గొప్పదనము 
తల్లి భాష చక్కదనము 
కలమెత్తి, గళమెత్తి ఇల 
చాటుటే శోభస్కరము 

తెలుగు భాష తీయదనము 
పదాల్లో నిండుదనము 
కల్గియున్న భాషరా 
తెలుగు గుండె శ్వాసరా 

పువ్వుల్లా మెత్తదనము 
నవ్వుల్లా చురుకుదనము 
పరికింప పద బంధము 
అత్యంత మనోహరము 

భాషల్లో బహు ఘనము 
ప్రపంచానికి విదితము 
తెలుగు కడు తేజోమయము 
పుట్టించును ఉత్తేజము 


కామెంట్‌లు