వృక్ష పరిరక్షణ మన బాధ్యత :- -- గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
చెట్టు విలువ తెలుసుకో 
పెంచడమే నేర్చుకో 
భవిష్యత్తు కాలంలో 
మేలులెన్నో బ్రతుకులో 

ఆయుష్షుకు ఆధారము 
అనారోగ్యమే దూరము 
కాపాడితే వృక్షాలు 
బాగుపడును జీవితాలు 

శ్రేయోభిలాషులు చెట్లు 
దేశాభివృద్ధికి మెట్లు 
ప్రతి ఒక్కరూ పెంచితే 
తోప్పునోయ్! పెను అగచాట్లు 

వృక్షాల సంరక్షణ 
చేయాలోయ్! చేయాలోయ్!
లేదంటే అవుతుందోయ్!
భవిత అంధకారము 


కామెంట్‌లు