అక్షర ఆణిముత్యాలు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
పుస్తకాల కాంతిలో 
పెంచుకో విజ్ఞానము 
అద్భుతమైన మెదడులో 
నింపుకో కడు వికాసము 

అక్షరాల నింగిలో 
మెరియాలి తారకలా 
సంతస సాగరంలో 
ఎగరాలి కెరటంలా 

అనురాగాల వాడలో 
అనుబంధాల కోటలో 
కలసిమెలసి ఉందామా!
అన్యోన్యత తోటలో 

పాటలోని పల్లవిలా 
మాటలోని మధురంలా 
మనుషులంతా ఒక్కటై 
మూటలోని పసిడిలా 


కామెంట్‌లు