సమయస్ఫూర్తి గొప్పది: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
ఉండాలి సమయస్ఫూర్తి
అదే తెచ్చిపెట్టు కీర్తి
మంచి మంచి అలవాట్లపై
పెంచుకోవాలి అనురక్తి

తెచ్చుకొమ్ము మంచి పేరు
నిలుపుకొమ్ము ఇంటి పేరు
ఈ సభ్య సమాజంలో
నిలిచిపొమ్ము హృదయంలో

ప్రాముఖ్యం ఆరోగ్యము
జీవితాన ఆనందము
అవి రెండూ కోల్పోతే
ఎంత ఉన్నా వ్యర్థము

సుగుణాలే భూషణము
లేక బ్రతుకు వికారము
పెంచుకుంటే మంచిది
దక్కుతుంది గౌరవము


కామెంట్‌లు