భవిత ఇక బంగారము: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
మార్చుకో ప్రవర్తన
తెచ్చుకో పరివర్తన
ఎవ్వరినీ చులకన
చేయరాదు హేళన

విశ్వాసమే వంతెన
ఇస్తుంది సాంత్వన
గెలుపుకు ఆధారము
అవుతుందోయ్! సాధన

పనికిమాలిన వాదన
ఇల వృధా ప్రేలాపన
మానుకుంటే మంచిది
హేయమైన భావన

జీవితాన బద్ధకము
కలుగజేయు నష్టము
వదిలిపెడితే వెంటనే
భవిత ఇక బంగారము


కామెంట్‌లు