జంగాయపాలెం గ్రామంలో దేశయ్య, వీరయ్య అనే ఇద్దరు రాజకీయ నాయకులు ఉండేవారు. ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినా ఇద్దరు పోటీ చేసి చెరోసారి గెలిచేవారు. ఇద్దరు ప్రజల మధ్యన శత్రువులు కానీ రాజకీయంగా చీకటి మిత్రులుగా సాగేవారు. ప్రజలు మాత్రం అమాయకంగా ఓట్లు వేసి వారిని గెలిపిస్తుండేవారు.
ఒకసారి సర్పంచ్ ఎన్నికలు వచ్చినయి. దేశయ్య, వీరయ్యలు ప్రత్యర్థులుగా పోటీలోకి దిగారు. ప్రజలంతా రెండు వర్గాలుగా విడిపోయారు. వేరువేరుగా ఇద్దరు నామినేషన్ వేశారు. అప్పుడే పట్నం నుంచి వచ్చిన రాంబాబు అనే యువకుడు ఎవరికి చెప్పకుండా నామినేషన్ వేశాడు. దేశయ్య, వీరయ్యలు విడివిడిగా రాంబాబును పిలిపించుకొని, నామినేషన్ విరమించుకోమని హెచ్చరించారు. ఉపసంహరణ గడువులోపు రాంబాబుపై ఒత్తిడి ఎక్కువైంది. ఇద్దరి బాధ తట్టుకోలేక, నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఇష్టం లేక రాంబాబు రాత్రికి రాత్రే పట్నం వెళ్ళాడు. దేశయ్య, వీరయ్యలతో పాటు రాంబాబు కూడా పోటీలో ఉన్నాడు. కానీ రాంబాబు మాత్రం ప్రత్యక్షంగా కనిపించడం లేదు.
రాంబాబు విషయం మర్చిపోయి దేశయ్య, వీరయ్యలు తమ ప్రచారం మొదలుపెట్టారు. ఉదయం ఎన్నికలు పూర్తయినవి. మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు అధికారులు వెల్లడించారు. సందడిగా జనం మధ్య ఉన్న వీరయ్య, దేశయ్యలకు మూర్చపోయినంత పనైంది. రాంబాబు కనీసం తన ఓటు కూడా వేయలేదు. కానీ తాను దేశయ్య, వీరయ్యలపై అత్యధిక మెజార్టీతో గెల్పొందాడు. విషయం తెలుసుకున్న రాంబాబు గ్రామానికి చేరుకోగానే, దేశయ్య, వీరయ్యల వెనకాల ఉన్న జనమంతా రాంబాబు వద్దకు వెళ్లారు.
నామినేషన్ వేసినంత మాత్రాన రాంబాబును చిత్రహింసలకు గురి చేశారు. చివరికి రాంబాబు పట్నం పారిపోయాడు. అన్ని విషయాలు గమనించి, ఇన్ని రోజులు మీ ఇద్దరికీ ఎదురుగా ఎవరు నామినేషన్ వేయలేదని, అందుకే మీలో ఒకరే గెలిచారు. మేమే రాంబాబును పట్నం వెళ్ళుమని సలహా ఇచ్చి, గెలిపించుకున్నామని ప్రజలు అన్నారు. దేశయ్య, వీరయ్యలకు మతిభ్రమించినంత పనైంది. మళ్లీ జీవితంలో వారిద్దరు పోటీ చేయలేదు. రాంబాబు గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్లి, గ్రామస్తులు మంచివారిని సర్పంచ్ గా ఎన్నుకోమని తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పట్నం వెళ్ళాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి