నిత్య భావ స్రవంతి: - సి.హెచ్.ప్రతాప్

మౌనం

మాటలు నిద్ర మౌనంలో
శబ్దాలు శాంతి మౌనంలో
భావాల లోతు మౌనంలో
హృదయ స్పందన మౌనంలో
కాలం నడక మౌనంలో
ప్రశ్నల జవాబు మౌనంలో
నిశ్శబ్ద సత్యం మౌనంలో
ఆత్మ సంభాషణ మౌనంలో
ఆలోచన వెలుగు మౌనంలో
జీవిత అర్థం మౌనంలో

జీవితం

మాటల ప్రయాణం జీవితం
శ్వాసల లయ జీవితం
సుఖ దుఃఖ సంగమం జీవితం
కాల ధార జీవితం
ప్రయత్నాల పాఠం జీవితం
పతనాల పాఠశాల జీవితం
ఆశల దీపం జీవితం
అనుభవాల గ్రంథం జీవితం
వేదనల విజ్ఞానం జీవితం
ముగింపుల ఆరంభం జీవితం 
కామెంట్‌లు