వెనక్కి లాగకు...
ముందుకు తొయ్యకు...
ఆ క్షణానికి నాకు తోచి నట్టుగా...
నా నడక నన్ను నడవ నీ వే మనసా...!
ప్రసాంతముగా సాగిపోయే నన్ను.... ఐతే గతంలోకి లాగేసి
బుర్రను కెలికెస్తావ్...!
లేదా... ఊహా లోకాల భావిష్యత్తు లోకి నెట్టేసి
లేని పోని ఆశలఊయల లూగిస్తావ్...!!
నన్ను యేమరచి...
వర్త మానపు కర్తవ్యా న్ని ఛిద్రం చేసెస్తావ్...!
భవిష్యత్ ను అయో మయం గావిస్తావ్...!!
నేనేర్పరచుకున్న లక్ష్యా న్ని కాకుండా....
నీకు నచ్చినట్టుగా....
నా భావిష్యత్తును నువ్ నిర్ణయిస్తావ్...!
కూడనివి కోరుతావ్...
అవసరమైనవి పట్టించు కోవ్...!!
ప్లీ జ్...., నామీద నువ్ పెత్తనం చలాయించకే మనసా...!!
నన్ను నేనుగా... నాకు నచ్చి నట్టుగా... స్వతంత్రంగా... నన్ను స్వేచ్ఛగా బ్రతక నీయవే మనసా....!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి