హుషారుతో నిండిన హుండీ ; - డా.సి వసుంధర,చెన్నై.
అమ్మ భాషలోకమ్మదనం,
మర్మ మెరుగని
అమ్మ మాటతోసమం.
    🩱
నీ భాషలో తమాషాలు రుచి చూస్తే కలుగుతుంది హుషారు.
అక్షరాలు లక్షణమై,విలక్షణ అర్థాలతో,పద పుష్ప రుచులతో
(కాంతి)
వాక్యాల వైభవం సర్వ గుణ సమన్విత
తెలుగును గూర్చి వర్ణింప ఎవరితరం!
       🌷
నన్నయ్య నాటిన
తెలుగు వెలుగుల మొలకకు విత్తు
వేల వత్సరాల చరిత గలదు.
 తిక్కన రాసిన పద్యమొక్కటి
చాలు తెలుగు భాషాభ్యుదయపటిమ తెలియగలదు.
  ఎర్రన సంపూర్ణ రూపమివ్వగా తెనుగుభారతము 
భారతదేశ కీర్తి కిరీటమయ్యే.
      🥜
శ్రీనాధుని  ఆంధ్రనైషధమది
 మాతృభాషకు గొప్ప భూషణం బు.
 శ్లేషలో వసుచరిత్ర
 సంగీత సాహిత్య
రస సంపూర్ణ పేటి.
ఆయన వాగ్ధాటికి ఆయనే సాటి.

పెద్దనవంటీకవులు లేరన్న మాట నిలబెట్టిన మనుచరిత్రలో ప్రవర వరూధునీ పాత్రల చిత్రీకరణ కౌశలమ్ము 
 తెలుగు వాణి చూడ ప్రతి తెలుగువానిలో
తొంగి చూచే.
      ✳️
ఎందరు కవి కోకిలలు, ఇంకెందరు కళా ప్రపూర్ణులు,
ఇంకేందరో కవి సామ్రాట్టులు
తెలుగుదేశమొక  సంగీత,సాహిత్య లలిత కళా సౌధమయ్యే, నా మాతృభాష మృత భాష కాదు అమృత భాష అనుచు 
ఆనందోత్సాహములతో అంతర్జాతీయ మాతృభాషదినోత్సవ ఉత్సాహ రసము ఉప్పతిల్ల 
ఉపహారము(పూజ )చేయుచున్నారు అక్షర ప్రసూనములతో
తెలుగు    కవులు,సహృదయులు, తెలుగుభాషాభిమానులు.
     అక్షర నీరాజనములు,.
 కవిత్వ పుష్ప కంఠ హారములు.
సమర్పణా కార్యక్రమము భాషాభిమానులకు గొప్ప వరముకాగా. జరుగుచున్నది నేడు నేత్రోత్సవమ్ము 
మాతృ భాష దినోత్సవమ్ము
🌿🌿🌿🌿🌿

కామెంట్‌లు