సుప్రభాత కవిత : - బృంద
పిలుపు కోసం పరితపించే 
హృదయాలకు
ఉత్సాహం ఇచ్చి ఊపిరిపోసేది
పలకరింపు

మనసులోని ముచ్చటలు 
పంచుకునే తోడు
గుండె మోయు బరువులన్నీ
దింపుకునే  వీలు...

పెదవులు పలికే మాటలు 
ఆలకించు  చెలిమి 
కన్నులలో కలతలు చెప్పకనే 
తెలుసుకునే  స్నేహం

చేయూత ఇవ్వలేక పోయినా 
చెవి ఇచ్చి వింటే
నలిగే మదికి దొరికే 
ఎంతో ఓదార్పు

సూర్యుడిలా వెలుగివ్వాలని 
అనుకోక
దీపం లా దారి చూపించి
సాయం చేసే  మంచితనం

మనిషిగా చేయదగ్గ 
మంచి సాయం 
మాటలతో దూరంచేసే 
ఒంటరితనం...

పలకరింపు  మనిషికున్న 
మంచిగుణం 
మానుకుంటే మనకు కూడా
దొరకదు ఏ స్నేహం

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు