మోదుగ పూలు!!: - డా.ప్రతాప్ కౌటిళ్యా
ఆడపిల్లలు 
అత్తిపత్తిలా స్పందిస్తే 
సమాజం 
మత్తుమందిస్తుంది. 

మొగలి పూలు పూస్తే 
నాగుపాములు హృదయం ఇస్తాయి. 
కాగిత పూలు పూస్తే 
జీవితం పరిమళిస్తుంది. 

జగతి గీతం ఇదీ
పడతికిది సందేశం.

మోదుగ పూలలా
ఆడపిల్లలు 
తాను ఆడపిల్లనని 
పూర్తిగా మర్చిపోవాలి 
మైమర్చిపోవాలి. 
గుర్తుచేసిన స్పందించకూడదు 
రియాక్ట్ అవ్వరాదు. 

ముందు నీవే స్పందిస్తే 
నీవే రియాక్ట్ అయితే ఎలా. 
అంతా 
స్పృహ నీకు అనవసరం నేస్తం. 

ఇంటా  బయట 
ఆడతనం నుంచి 
బయటపడాలి 
ఆ స్పృహ నుంచి 
బయటకు రావాలి నేస్తం. 

ఆడపిల్లలు 
మోదుగ పూల లా ఉండాలి.!?

డా ప్రతాప్ కౌటిళ్యా 
శ్రీ శ్రీ కళావేదిక సమన్వయకర్త.

కామెంట్‌లు