1.
అనలాంబకుడవీవె అసమనేత్రుడవీవె
ఆది భిక్షువు నీవె ఆబోతు రౌతీవె
ఇందుమౌళివి నీవె ఇభచర్మధరుడీవె
ఈప్సితంబుల దీర్చు ఈశ్వరుండవు నీవె
ఉగ్రనేత్రుడ వీవె ఉమారమణుడవీవె
ఊరి జనులను కాచు ఊర్ధ్వశాయివి నీవె
ఋషభకేతనుడీవె ఋతంబరుడవు నీవె
కాశీపురాధీశ! కైలాస గిరి వాస!
2.
ఎదలనేలెడు సామి! ఎద్దుతత్తడి జోదు!
ఏడేడు లోకాల కేకదిక్కువు నీవె!
ఐశ్వర్యముల బంచు
ఐదు మోముల దేవ!
ఒరులేల నాకిలను? ఒక్కడవు నువ్వుండ;
ఓం నమః శివాయని ఓనమాలను నేర్తి
ఔదలను తాల్చెదను అభిరూప! నీ మాట;
అంబరాంబరుడీవె అంబరీషుడనీవె
కాశీపురాధీశ! కైలాసగిరి వాస!
3.
కఱకంఠ! కామారి! కాలకాలుడ వీవె!
కరుణించి రావె,మా కష్టముల కడదేర్చ!
ఖట్వాంగధరుడీవె! క్రతు ధ్వంసుడవు నీవె!
గట్టు విల్తుడవీవె, గంగాధరుండీవె!
గరళ కంఠుడవీవె, గౌరినాథుడవీవె!
ఘల్లుఘల్లున మోగు గజ్జెలాడగ నీవె!
ఘన నాట్యరాజీవె, గజవైరి,ఖరువీవె!
కాశీపురాధీశ! కైలాసగిరి వాస!
4.
చంద్రచూడుడవీవె, చలిగిరినివాసీవె!
ఛందస్సు కర్తీవె, ఛత్రపతివీ నీవె!
జడదాల్పువేల్పీవె, జంగమయ్యవు నీవె!
ఝర్ఝరీ,తిగకంటి, జాబిల్లి తాల్పీవె!
టక్కరివి,ధూర్జటివి, డమరు తాల్పుడవీవె!
తరుణేందుమౌళీవె, త్ర్యంబకుండవు నీవె!
థకదిమిత దిమిథకిత తాండవ ప్రియుడీవె!
కాశీపురాధీశ! కైలాసగిరి వాస!
5.
దక్షజాపతి నీవె, దక్షిణామూర్తీవె!
ధరణీశ్వరుడవీవె, ధరకార్ముకుడవీవె!
నందివాహనుడీవె, నాగహారుడవీవె!
పరమేశ్వరుడవీవె, పంచ వక్త్రుడవీవె!
ఫలములొసగెడు రౌద్ర ఫాలనేత్రుడవీవె!
బతుకమ్మ పతి నీవె, బడుగులకు నడుగీవె!
భద్రేశుడవు నీవె, భస్మాంగుడవు నీవె!
కాశీపురాధీశ! కైలాసగిరి వాస!
6.
మదనాంతకుడవీవె, మహాకాలుడవీవె!
యజ్ఞ రూపుడవీవె, యజ్ఞభుక్కువు నీవె!
రజతాద్రి శిఖరముల రవళించునది నీవె!
లయకారుడవు నీవె, లలాటాక్షుడవీవె!
వర్థనుండవు నీవె, వామదేవుడవీవె!
శంకరుండవు నీవె, శంఖుధారివి నీవె!
షష్టిభాగుడ! శూలి! శరణు వేడెదమయ్య!
కాశీపురాధీశ! కైలాసగిరి వాస!
7.
సర్వజ్ఞుడవు నీవు, సావిత్రుడవు నీవు!
సింహ దంష్ట్రుడవీవు, సితి కంఠుడవు నీవు!
సుగ్రీవుడవు నీవు, సుప్రతీకుడవీవు!
హరకుడవు,హంసుడవు,హర దేవుడవు నీవు!
ముక్కంటి,శితికంఠి, మొదలి వేల్పువు నీవు!
భూతనాథుడవీవు, భువనేశుడవు నీవు!
పాపముల నడయించి తాపముల తొలగించు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి