ప్రేమరస వాహిని: - డా.సి వసుంధర,చెన్నై
 వెన్నెల  వెన్న  ఎంత మెత్తనో  ఇసుక తిన్నెలపై
 నిశీధిలో నీరాక
అంతమృదులమే.
 2
నల్లనయ్యా! నీ పిల్లన గ్రోవీ నవ్విన
ధ్వనులు, నా మదికి బంగారు గనులు.వీనులకు
సుస్వరాలధ్వనులు
3)

నీ
తలపుల సౌధపు
అంగనమున (ముంగిట్లో)
నిల్చి పిలిచితి.  
ఈ చెలి పిలుపు చెవికెక్క లేదో,లేక
వాదో, ఏదో  నీదు 
 మనోరథమేదో
 తెల్పవేమి?

ప్రేమరస శాస్త్ర సార మెరిగిన అంతర్వాణివి (పండితుడు)గదా
వీవు. నా ఎదలోని
అంగద(దుఃఖం) నోర్వలేరా రా, రా!
రాధ మనోరథ మీడేర్పరా!

అటుచూడు జ్యోత్న్స(వెన్నెలరాత్రి)మెత్తని డోలగామారిరమ్మనె నిన్ను.

మమతల పందిరి నేందుకునేర్పర్చితివి, ఎందుకు  నన్నందు వల్లి వలె బంధించితివో చెప్పుమా.వికసించిన నా ఆత్మాను భూతి ప్రసూనముల పరిమళము  నీ పదములకు 
నద్దవలే రమ్ము నా సర్వస్వమా.
💧🌹🌹🌹💧

కామెంట్‌లు