ఆ సర్వేశ్వరుడే.: - కోరాడ నరసింహా రావు!
మన కర్మలకు క్రియ లొనర్చి... 
   కర్త్రుత్వము వహిస్తున్న
 ఫలితముల ననుభ వింప జేయు... 
   ఆ సకలసృష్ఠికర్త.... సర్వేశ్వరుని కన్న మిన్నయగు విజ్ఞాన వేత్త వే రె వ రీ  ప్రపంచములో...!? 

జ్ఞాన, విజ్ఞానము లుద్భ వించిన వీతని నుం డే ! 
 మన అజ్ఞానములను తొ లగించగలిగేదీఈయనే...!

పంచ భూతముల ఈ ప్రపంచమూ...  అ తని యనుగ్రహమే...!! 

మనకు ప్రజ్ఞాన శక్తి నొసగి
  మనల నపర బ్రహ్మలను చేసినది...ఈతని దయయే...!

ఈ పచ్చ దనము, ఈ ప్రాణి కోటి... 
 ఈ భోగ, భాగ్య, సుఖ, సౌఖ్యానందములు... 
 ఈ త ని కృపయే...!! 

సైన్సు గొప్పది... సైన్సు గొప్పది...  అని డప్పు వా యించటం కాదు..., 
  ఆ సైన్సు కు మూలాన్నే మరిచి పోతే ఎలా....?! 

సకల శాస్త్రాలకు... 
  సర్వ కళలకు... 
 సర్వాధిపతి ఆ సర్వేశ్వరుడే....! 
 సర్వేశ్వరాయ విద్మహే
  సకల సృష్ఠి కర్తా ధీ మహి
 తన్నో పరమాత్మ ప్పచోద యాత్........ 
      ******


కామెంట్‌లు