వదలక వెంటాడే వ్యధలకు
కదలక నిలబెట్టే కాలానికి
మధ్యన నలిగే మనసుల
వైవిధ్య భరిత కథలే జీవితం!
కట్టేసే మమతల బంధాలు
చుట్టేసే కలతల సుడిగుండాలు
కట్టకడపటి మజిలీ వరకూ
తట్టుకుని నిలబడేదే జీవితం!
రాలిన పువ్వుల దారులలో
దాగిన ముళ్ల తాకిడికి
రేగిన గాయపు మంటలలో
మూగగా చిక్కి రోదించేవే జీవితాలు!
పయనపు దారులు ఎప్పుడూ
సులభము కావే ఎవ్వరికీ
లలాట లిఖితములే చివరికి
సుఖమైనా దుఃఖమైనా జీవితాలు!
అందిన స్వర్గం కొందరిదైతే
అందక ఊరించే కొమ్మ కొందరిదీ!
పొందిన సంతోషంతో పాటు
పోగొట్టుకున్న విలువలే జీవితాలు!
ఎండకు చిగురేసే రెమ్మలు
వేడికి వసివాడే ఆకులు
ఏది శాపమో ఏది వరమో
తెలియక సాగే జీవితాలకు....
వెలుగిచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి