కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
ఏడు కొండలు...కోటి గుండెలు...

ఓం నమో నారాయణాయః..! 
నమో శ్రీశైలవాసా..! నమో ఓ శ్రీనివాసా..! 
నమో వెంకటేశా..! నమో ఓ తిరుమలేశా..! 
మహానందమాయే ఓ మహాదేవ దేవ..!

ఓ శ్రీనివాసా..! ఓ శ్రీశైలవాసా..!!
మీ చరతం...దివ్య చరితం...
మీ నామం...పరమ పావనం...
గోవిందా గోవిందా... 
ఏడు కొండలవాడా..! 
వెంకట రమణా గోవిందా గోవిందా..!! 
అంటూ నాలుగు దిక్కుల్లో 
పిక్కటిల్లుతోంది మీ దివ్యనామం...

ఓ వెంకటేశా..! ఓ తిరుమలేశా..!!
సర్వలోకాలు ఆ శ్రీహరిమయమట...
మీరు ఆ మహావిష్ణువుకు ప్రతిరూపమట...
నేడు జగమంతా శ్రీ వెంటేశ్వరమయమట
 
ఏడుకొండల్లో కొలువైఉన్న ఓ కోనేటిరాయా
మూల్లోకాలను కాపాడే ఓ ముక్తి ప్రదాతా...
తరతరాలుగా యుగయుగాలుగా కోట్లాదిమంది భక్తుల గుండెగుడిలో 
ఆరనిజ్యోతిగా వెలిగే 
ఓ ఆపద మొక్కులవాడా..!
ఓ అనాధ రక్షకా...
ఓ ఆపద్భాంధవా..!!

ఆదుకోవా..? మమ్ము ఆదరించవా..?
కరుణించవా..? మమ్ము కాపాడరావా..?
ఈ దీనులపై దయచూపవా ఓ దైవమా..? 
మీ దర్శనభాగ్యం మాకు కలిగించవా..?

కోరము తండ్రీ మిమ్ము కోటివరాలు
ఎక్కితిమి ఏడుకొండలు...
మొక్కితిమి మీ పాదపద్మములకు...
దక్కిన చాలు మాకు మీ దర్శనభాగ్యం... 
మా జన్మధన్యమేనయా ఓ జగదీశా ఓ పరమేశా...

ఏడు కొండల వాడా..! 
వెంకట రమణ గోవిందా గోవిందా..!! 



కామెంట్‌లు